CTR: పుంగనూరులో ఈనెల 19న ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు EE శ్రీనివాసమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పుంగనూరు విద్యుత్ డివిజన్ కార్యాలయంలో అదాలత్ జరుగుతుందని చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. సదుం, పలమనేరు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.