ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. టెస్టు క్రికెట్ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డాడు. స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించే పిచ్‌లు తయారు చేయడాన్ని విమర్శించాడు. పరుగులు ఎలా రాబట్టాలో తెలియని పిచ్‌లను తయారుచేయడం ఎందుకని ప్రశ్నించాడు.