KDP: ఇవాళ ఢిల్లీలో MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్వర్యంలో జరుగుతున్న దళితుల ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో జిల్లా వాసులు పాల్గొన్నారు. పోద్దుటూరుకు చెందిన బుడగ జంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు చాటకొండు కొండయ్య సారధ్యంలో బుడగ జంగం నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు నిర్వహించిన కళ ప్రదర్శన ఆకట్టుకుంది.