టీమిండియా కెప్టెన్ గిల్ విశ్రాంతి లేకుండా వరుస సిరీస్‌లు ఆడుతున్నాడు. ఒక్కో సిరీస్ మధ్య వారం కూడా గ్యాప్ ఉండటం లేదు. దీంతో BCCI ప్లానింగ్, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ ఏంటి అనేది అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. గిల్‌ను అన్ని ఫార్మాట్లలో ఉంచాలని BCCI పెద్దలు రెస్ట్ లేకుండా ఆడించేస్తున్నారని.. ఇది గిల్ కెరీర్‌తో ఆటలాడినట్లుగా ఉందన్నారు.