GNTR: టీడీపీ ప్రభుత్వం కాపులకు కేటాయించిన రిజర్వేషన్లను వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేసిందని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు విమర్శించారు. కాపు రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరిలో జరిగిన వన సమారాధన వేడుకలో విన్నకోటను సన్మానించారు. కూటమి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని విన్నకోట అన్నారు.