BDK: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం లక్ష్మీదేవి పల్లి మండలంలోని చాతకొండ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రస్తుత సీజన్లో వరి ధాన్యానికి సన్న రకం ధాన్యాన్ని ధర క్వింటాకు మద్దతు ధర ఇస్తున్నట్లు అన్నారు.