E.G: కోరుకొండ MRO కార్యాలయం వద్ద రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, సంక్షేమ పథకాల సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, సాగునీరు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా.. మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.