PLD: నరసరావుపేటలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ కృతికా శుక్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూమి, రెవెన్యూ, ఆస్తి, తదితర సమస్యలకు సంబంధించిన అర్జీలు అందినట్లు తెలిపారు. PGRSకు అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, అర్జీలు రీ ఓపెన్ కాకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు.