ADB: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఇవాళ గాది గూడ మండలంలోని అర్జుని(కొలం గూడ) గ్రామంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీతో కలసి కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల 75 లక్షల జన్మన్ నిధులతో మంజూరైన హాస్టల్ భవన నిర్మణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.