ATP: విజయవాడలో జరిగిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సొళ్ల బొజ్జిరెడ్డి, సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకటప్పతో సహా ఇతర కమిషన్ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.