KKD: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై కొందరు దాడి చేశారు. దీనిని నిరసిస్తూ సోమవారం కాకినాడలో వైసీపీ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి. కాకినాడ రూరల్ మినహా ఆరు నియోజకవర్గాల వైసీపీ ఇంఛార్జ్ తరలివచ్చారు. బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ నిరసనలో జెడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు.