SRD: ఖేడ్ పట్టణంలో రేపటి నుంచి జరిగే సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని DEO వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం ఏర్పాట్లను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు, కలెక్టర్, MLA కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. సైన్స్ ఫెయిర్‌తో పాటు సాయంత్రం సంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.