భారత టెస్టు చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచిన విషయం తెలిసిందే. కోహ్లీ సారథ్యంలో 68 టెస్టులు ఆడిన టీమిండియా 40 విజయాలు సాధించింది. విరాట్ కెప్టెన్ అయ్యాక 8 ఏళ్ల వ్యవధిలో భారత్ సొంతగడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. కానీ, ఇప్పుడు ఎదురవుతున్న పరాభవాలు చూసిన తర్వాత తన విలువేంటో అందరికీ అర్థం అవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.