ATP: తన కారుపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం టీడీపీ మహిళా నేత సంగా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద పార్కింగ్ చేసిన AP39 RY 9709 నంబర్ కారుపై దుండగులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విన్నవించారు.