కోనసీమ: అల్లవరం మండలం కొమరగిరిపట్నం, అల్లవరం గ్రామాల్లోని సొసైటీల్లో పాడి రైతులకు సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా రైతులకు పశువుల దాణా అందిస్తామన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.