CTR: చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికుల వివరాలు.. కొంత కాలంగా కార్యాలయాల చుట్టూ తిరిగినా తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట (M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.