TG: అంగన్వాడీ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మంత్రి సీతక్క గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. రిటైరైన అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న మిగిలిన బెనిఫిట్స్‌ని త్వరలో అందజేస్తామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కారుణ్య నియమకాల ఫైల్ పురోగతిలో ఉందని పేర్కొన్నారు.