SRCL: వేములవాడలోని శ్రీ భీమేశ్వరస్వామి వారి ఆలయంలో అడుగడుగునా నిఘాను తీవ్రతరం చేశారు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో కనిపెట్టె విధంగా ఆలయ అధికారులు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో 32 సీసీ కెమెరాలు, వివిధ ప్రాంతాల్లో 22 సీసీ కెమెరాలు మొత్తం 54 సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. భక్తులకు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నారు.