NZB: మోస్రా మండలంలో గత పదేళ్లుగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించిన తహశీల్దార్‌కు ఇవాళ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. సర్వే నంబర్ 952లో నెలకొన్న సమస్యలు తీర్చి, పట్టాదారులకు వెలుసుబాటు కల్పించినందుకు ఋణపడి ఉంటామన్నారు. తమ మండలానికి ఎన్నో సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతా రెడ్డి, స్వామి గౌడ్, రాజశేఖర్ రెడ్డి, సాయిలు, షరీఫ్ పాల్గొన్నారు.