SKLM: జి. సిగడాం మండలం బాతువ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ స్థానిక నాయకులతో కలిసి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు సందర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు నిరంతరం రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి మొత్తం సందర్శించి, వైద్య పరికరాల పనితీరుపై అధికారులతో సమీక్షించారు.