SRD: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థి దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సాధికారత ఉపాధి అవకాశాలు అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. ఈ వేదికలో గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, కెరియర్ గైడెన్స్, ఉపాధి నోటిఫికేషన్లు, హాస్టల్ సదుపాయాలు, మెటీరియల్ పంపిణీ వంటి అంశాలపై చర్చించారు.