WNP: 1వ వార్డు రాయిగడ్డలో సోమవారం మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. డ్రైనేజీల్లో చెత్త చేరి మురుగు నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు కాంగ్రెస్ నాయకుడు మండ్ల దేవన్ననాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ మున్సిపల్ సిబ్బందితో ఈ చెత్తను తొలగించారు.