జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్‌లో ఇటీవల అరెస్టు చేసిన ఉగ్ర అనుమానితుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘మేడమ్ సర్జన్’ అనే కోడ్‌తో ఉగ్ర డాక్టర్లు దేశంలో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు 6న దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ‘ఆపరేషన్ డీ-6’ పేరుతో వీరు కుట్ర పన్నినట్లు తేలింది.