భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు భారత్ భయపడదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారిని ఒకే విధంగా చూస్తామని.. ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన తెలిపారు. పాక్‌తో సత్సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ‘రక్తం, నీరు కలిసి ప్రవహించవు’ అని పేర్కొన్నారు.