KDP: ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పని చేసిన 43 మంది అధికారులను ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటుని ఆరోపణలు వెలువడుతున్నాయి.