HNK: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల WGL పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి గురించి వస్తున్న సమాచారం మరింత కలచివేస్తోందన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి ఆత్మలకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు కోరారు.