AP: విద్యావ్యవస్థను గత ప్రభుత్వం అధోగతిపాలు చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. స్కూళ్లను మూసివేయడం తప్ప.. అభివృద్ది చేయలేదన్నారు. సర్కారు బడుల్లోని పిల్లలకు తమ ప్రభుత్వం కాంపిటేటివ్ మెటీరియల్ ఇస్తుందని వెల్లడించారు. నెల్లూరులోని పలు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి సందర్శించి మాట్లాడారు. పీఆర్సీ హైస్కూల్ మాదిరిగా మరో 15 స్కూళ్ల రూపురేఖలు మారుస్తామన్నారు.