గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన మేయర్, అందిన ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.