NLG: దేవరకొండ మాజీ ఎంపీటీసీ గార్లపాటి లీలావతి మృతి పట్ల శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం వారు లీలావతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆలంపల్లి నరసింహ, జాలే నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.