కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు శివారు మేకావారిపాలెంలో పీఏసీఎస్ వద్ధ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వ్యవసాయ డ్రోన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రైతు సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని విశేషంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.