SRD: రామచంద్రపురం రాయసముద్రం చెరువు సుందరీకరణ కోసం హెచ్ఎండిఏ నిధులు మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ స్థానికులతో కలిసి పర్యటిస్తూ తెలిపారు. నాగులమ్మ గుడి వద్ద మట్టి కుంగుతోందని స్థానికులు తెలిపిన నేపథ్యంలో, కొత్త రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇటీవల చేసిన శంకుస్థాపన పనులను సోమవారం పరిశీలించారు.