AP: రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.