TG: మక్కాకు వెళ్లిన ప్రయాణికులు చనిపోవడం బాధాకరమని సీపీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 23 వరకు ట్రావెల్ ప్లాన్ ఉందన్నారు. సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది చనిపోయారని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి మక్కాకు 54 మంది వెళ్లారని.. 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో వెళ్లారని వివరించారు. మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి మాత్రమే బయటపడ్డాడని చెప్పారు.