బీహార్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి బీహార్ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరును ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. దీంతో పదోసారి సీఎంగా నితీష్ కుమార్ కొనసాగనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు దిలీప్ జైస్వాల్ పేర్కొన్నారు.