HYD: రైలు ప్రయాణంలో డోర్ వద్ద కూర్చుని వెళ్తున్నారా..? చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డోర్ వద్ద కూర్చుని ఓ వ్యక్తి మొబైల్ ఆపరేట్ చేస్తుండగా సికింద్రాబాద్ దాటిన తర్వాత, దొంగ ఒక్కసారిగా అతని మొబైల్ గుంజుకొని వేరే స్టేషన్లో దిగిపోయాడు. ట్రైన్ రన్నింగ్లో ఉండటంతో అతను ఏం చేయలేకపోయాడు. సీట్లో కూర్చొని సురక్షితమైన ప్రయాణం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.