ప్రకాశం: త్రిపురాంతకంలోని శ్రీబాలత్రిపుర సుందరీదేవి అమ్మవారిని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఇవాళ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలు కరువు కాటకాలు లేకుండా, సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.