AP: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎదురుమొండి బ్రిడ్జి కట్టకపోయినా అక్కడి ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు.. పాత ఎడ్లంక సమస్యను నేను కొంచెం స్లో చేశాను. వారు ఉద్యమాలు చేస్తున్నారు, ఎలా సాధిస్తారో చూద్దామని స్లో చేశాను. మేము సమస్యను పరిష్కరిస్తామని వాగ్ధానం చేశాం. రాష్ట్రం ఆర్థికంగా పుంజుకున్న తర్వాత నిధులు తెచ్చుకోవాలి’ అని పేర్కొన్నారు.