కోనసీమ: కార్తీక వన సమారాధనలతో సమాజంలో ఆధ్యాత్మిక వాతావరణం పెరగడంతో పాటు ఆహ్లాదం లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆలమూరులో సూరపురెడ్డి సూర్యనారాయణ, వారి కుమారుల ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. అందరూ ఒక చోట చేరి సహపంక్తి భోజనాలు చేయడానికి వన సమారాధనలు దోహదం చేస్తాయన్నాయని పేర్కొన్నారు.