పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత తలకు క్లాత్ లేకుండా దర్శనమిచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న డార్లింగ్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, నటుడు సుబ్బరాజుతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫొటోల్లో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్.. ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.