TG: సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. పైరసీ భూతం చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమను వేధిస్తోందని, సినిమాల పైరసీ వల్ల లక్షల మంది నష్టపోతాయని అన్నారు. సీపీ సజ్జనార్ ఎంతో చొరవ తీసుకుని పైరసీ ముఠాను పట్టుకున్నారని తెలిపారు. సీపీ సజ్జనార్ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చిరంజీవి కొనియాడారు.