ASR: జీ.మాడుగుల మాజీ ఎంపీపీ కొర్రా పద్మ ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. మృతురాలు ప్రస్తుతం గడుతూరు సెగ్మెంట్ ఎంపీటీసీగా పనిచేస్తున్నారు.