కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామిని విశాఖపట్నం కమిషనర్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధి కోసం లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.