ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. అత్యల్పంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు తీవ్రమైన చలితో వణికిపోతున్నారు. ఈ అసాధారణ చలి వాతావరణం జనజీవనాన్ని స్తంభింపజేస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చలి తీవ్రత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.