ATP: అనంతపురం రూరల్ పరిధిలోని చెన్నే కొత్తపల్లి రైతులకు 80 శాతం రాయితీతో ఉలువలు పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, మొబైల్ తీసుకుని, రైతు సేవా కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 10 కేజీల ఉలవలకు 80 శాతం రాయితీతో ఇస్తున్నామని తెలిపారు.