SKLM: బాల్యవివాహాలు చట్టరీత్య నేరమని బాలల రక్షణ విభాగం కౌన్సిలర్ డి.సీతారాములు పేర్కొన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కోటబొమ్మాళి ఐసీడీఎస్ కార్యాలయంలో CDPO సీహెచ్ ఐమావతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల వలన ఆరోగ్యం పాడవుతుందన్నారు. బాలలను చట్టపరమైన దత్తత తీసుకుంటే ఎటువంటి నేరము ఉండదన్నారు.