KMM: సీసీఐ విధించిన కొత్త నిబంధన జిన్నింగ్ మిల్లులను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాటన్ ట్రేడర్స్, మిల్లర్స్ అసోసియేషన్ నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కొనుగోళ్లు ఆగిపోతే రైతులకు మద్దతు ధర దక్కదని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నదాతలు వేడుకున్నారు.