E.G: కోరుకొండ శ్రీ సీతారామ భార్గవ గాయత్రి సేవా సంఘం ఆధ్వర్యంలో నిన్న కార్తీక దామోదర వన సమారాధన వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె గాడాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకలాపాలు, అభివృద్ధి అంశాలపై ఆమె నేతలతో చర్చించారు.