KRNL: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆదివారం మౌనిక (21) అనే యువతి, నవజాత శిశువు మృతి చెందారు. ఎమ్మిగనూరు ఆసుపత్రి నుంచి కర్నూలుకు రిఫర్ చేయగా, మౌనికకు సిజేరియన్ చేసినా శిశువు బతకలేదు. మరుసటి రోజు తల్లి కూడా మరణించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తుండగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆరోపణలను ఖండించారు.