ELR: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో నిన్న రాత్రి ‘రచ్చబండ’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథం మాట్లాడుతూ.. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చెయాలని ఆయన కోరారు. వైసీపీ తూ. గో. జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు, తోట రామకృష్ణ పాల్గొన్నారు.