AP: శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో భాగంగా రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి పుట్టపర్తిలోని హిల్యూ స్టేడియంలో జరిగే మహిళా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొంటారు. 20, 21న యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 23న అధికారిక శతజయంతి వేడుకలను నిర్వహిస్తారు.